సిక్కింలో భూకంపం.. జనం బెంబేలు… 5.4 తీవ్రతతో

Contacts:

National

oi-Shashidhar S

|

Published: Monday, April 5, 2021, 22:58 [IST]

సిక్కింలో భూకంపం వచ్చింది. రాజధాని గ్యాంగ్‌టక్‌ సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా రికార్డైంది. గ్యాంగ్‌టక్‌కి 25 కి.మీ దూరంలో ఈస్ట్‌-సౌత్‌వెస్ట్‌ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు. రాత్రి 8:49 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.

Mild earthquake hits Sikkim-Nepal border; tremors felt in Bihar, Assam and West Bengal

భూకంపం ధాటికి సిక్కింతో పాటు పొరుగు రాష్ట్రాలైన అసోం, బెంగాల్‌, బిహార్‌లోనూ భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. నేపాల్‌, భూటాన్‌లోనూ భూప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపం గ్యాంగ్‌టక్‌ నగరాన్ని కుదుపునకు గురిచేసిందని స్థానికులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.

Posted in: Telugu News Posted by: admin On: