లైంగిక నేరాలకు కారణం అదే.. ఇదీ పాక్ ప్రధాని ఇమ్రాన్ మాట

Contacts:

International

oi-Shashidhar S

|

Published: Monday, April 5, 2021, 22:48 [IST]

పాకిస్తాన్‌లో పెరుగుతున్న లైంగిక నేరాలకు అశ్లీలతే కారణం అని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ప్రజలతో ఫోన్ ద్వారా నిర్వహించిన మూఖాముఖీ కార్యక్రమంలో భాగంగా ఈ కామెంట్స్ చేశారు. దేశంలో జరుగుతున్న లైంగిక నేరాల్లో కేవలం ఒక శాతం మాత్రం మీడియా ద్వారా వెల్లడవుతున్నాయని వివరించారు. 1970లలో తాను క్రికెట్ ఆడేందుకు బ్రిటన్‌కు వెళ్లే సమయంలో అక్కడి సమాజంలో అశ్లీలత, మాదకద్రవ్యాల కల్చర్ వేళ్లూనుకోవడాన్ని గమనించినట్టు తెలిపారు.

కానీ ప్రస్తుతం అక్కడ విడాకుల రేటు 70 శాతానికి పెరిగిందని ఇమ్రాన్ ఖాన్ వివరించారు. మితిమీరిన విసృంఖలత్వమే దీనికి కారణమని స్పష్టం చేశారు. ఇస్లాంలో పరదా ధరించాలనే నిబంధన కోరికను నియంత్రించేందుకే అని తెలిపారు. సమాజంలో ఎంతో మంది తమని తాము అదుపులో పెట్టుకోలేని అసక్తులని కామెంట్ చేశారు. వీరి వల్ల సమాజంపై ఎంతో కొంత ప్రభావం ఉంటుందని ఇమ్రాన్ చెప్పారు.

imran khan blames vulgarity for rising sexual violence in pak

ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్లకు ప్రాధాన్యం సంతరించుకుంది. లైంగిక నేరాలకు కారణం ఆశ్లీలతే అని ఆయన ఒప్పుకున్నారు. అయితే దానికి సంబంధించి కఠిన చట్టాలను మాత్రం తేవాల్సి ఉంది. కేవలం కారణాలు చెప్పి చేతులు దులుపుకోవడం మంచి పద్దతి మాత్రం కాదని విమర్శకులు అంటున్నారు.

Posted in: Telugu News Posted by: admin On: