రికార్డు స్థాయిలో 72 వేలకు పైగా కొత్త కేసులు , 459 మరణాలు ..ఒక్కరోజులోనే కరోనా విలయం

Contacts:
459 కి చేరిన మరణాలు .. మోగుతున్న మరణ మృదంగం

459 కి చేరిన మరణాలు .. మోగుతున్న మరణ మృదంగం

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 459 మంది కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు . బుధవారం 354 నుండి ఒక్కసారిగా 459 కి భారీ జంప్ మరణాలలో కనిపిస్తుంది . దీంతో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,62,927 కు చేరుకుంది.

గత 24 గంటల్లో 31,489 క్రియాశీల కేసులు పెరిగి, మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 5,84,055 గా నమోదైంది . మార్చి 31 వరకు కోవిడ్ -19 కోసం మొత్తం 24, 47,98,621 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. వీటిలో 11,25,681 నమూనాలను బుధవారం పరీక్షించారు.

 కరోనా కట్టడి యత్నాలు .. వ్యాక్సినేషన్ ముమ్మరం

కరోనా కట్టడి యత్నాలు .. వ్యాక్సినేషన్ ముమ్మరం

గత కొన్ని వారాలుగా, కోవిడ్ -19 కేసుల సంఖ్య భారతదేశంలో పెరుగుతోందని, దీనిని నిపుణులు సెకండ్ వేవ్ అని పేర్కొన్నారు. మొదటి వేవ్ కంటే కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకారి అని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు అలెర్ట్ గా ఉండాలని , కరోనా నియంత్రణా చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఇదే సమయంలో కరోనా వ్యాక్సినేషన్ సైతం వేగం పెంచాలని పేర్కొంది.

దేశవ్యాప్తంగా 50,000 కేంద్రాలలో కరోనా టీకాలు వేస్తున్నారు , వీటిలో ప్రైవేటు రంగంలో 6,000 ఉన్నాయి.

నేటి నుండి మూడో దశ వ్యాక్సినేషన్ .. ఇప్పటివరకు 64 మిలియన్ వ్యాక్సిన్ లు

నేటి నుండి మూడో దశ వ్యాక్సినేషన్ .. ఇప్పటివరకు 64 మిలియన్ వ్యాక్సిన్ లు

ఇక మూడవ దశ టీకా కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం కోవిడ్ -19 టీకాలను ఇవ్వాలని మార్చి 23 న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

45 ప్లస్ కేటగిరీకి టీకాలు ఇచ్చే కార్యక్రమం నేటి నుండి మొదలైంది. ఇక వీరికి వ్యాక్సినేషన్ ఇవ్వటం వెనుక కారణం ఉందని , దేశంలో కోవిడ్ -19 కారణంగా 88% మరణాలు ఈ వయస్సులో జరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించింది. జనవరి 16 న దేశవ్యాప్తంగా కోవిడ్ -19 టీకా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దేశంలో కనీసం 64 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులను అందించారు.

Posted in: Telugu News Posted by: admin On: