ముంబై మాల్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం .. 10కి పెరిగిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ

Contacts:
అగ్నిప్రమాద ఘటనలో కోవిడ్ హాస్పటల్ లో 10 మంది మృతి

అగ్నిప్రమాద ఘటనలో కోవిడ్ హాస్పటల్ లో 10 మంది మృతి

అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో మూడో అంతస్తులో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ లో ఉన్న కరోనా బాధితులను వెంటనే ఇతర ఆసుపత్రులకు తరలించారు. 20కి పైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్టు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. అయితే సన్‌రైజ్ హాస్పిటల్ వర్గాలు మాత్రం ప్రాణనష్టం కోవిడ్ -19 వల్ల జరిగిందని, అగ్నిప్రమాదం వల్ల కాదని చెప్తున్నారు.

ఇద్దరు అగ్నిప్రమాదానికి ముందే మరణించారంటున్న ఆస్పత్రి వర్గాలు

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి ముందే ఇద్దరు రోగులు మృతి చెందినట్లుగా పేర్కొన్నారు.

డ్రీమ్స్ మాల్‌లోని 100-200 చదరపు మీటర్ల పరిధిలోని ఒక దుకాణం వద్ద మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. సన్‌రైజ్ హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి గత సంవత్సరం కోవిడ్ యొక్క అసాధారణ పరిస్థితులలో ప్రారంభించబడిందని , చాలా మంది రోగులను రక్షించడంలో సహాయపడిందని చెప్పారు. ఫైర్ లైసెన్స్, నర్సింగ్ హోమ్ లైసెన్స్ వంటి అన్ని అనుమతులతో ఇది పనిచేస్తోందని , బాధితులను సురక్షితంగా వివిధ ఆసుపత్రులకు తరలించామని చెప్తున్నారు.

కోవిడ్ కేర్ ఆసుపత్రిలో చేరిన 76 మంది రోగులు .. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

కోవిడ్ కేర్ ఆసుపత్రిలో చేరిన 76 మంది రోగులు .. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మాల్ లో నిర్వహిస్తున్న కోవిడ్ ఆస్పత్రిలో ఉన్న కోవిడ్ సోకిన వారితో సహా 70 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. మొత్తం 76 మంది రోగులు ఆసుపత్రిలో ఉండగా వారిలో 73 మంది కోవిడ్ -19 రోగులు. వీరందరినీ వివిధ ఆసుపత్రులకు తరలించారు.

డిసిపి ప్రశాంత్ కదమ్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మరణించారని అధికారికంగా నిర్ధారించారని అంటున్నారు. కోవిడ్ కేర్ ఆసుపత్రిలో చేరిన 76 మంది రోగులకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందన్నారు .

మాల్ లో ఆస్పత్రిపై విస్మయం వ్యక్తం చేసిన ముంబై మేయర్ .. చర్యలు తీసుకుంటామని వెల్లడి

మాల్ లో ఆస్పత్రిపై విస్మయం వ్యక్తం చేసిన ముంబై మేయర్ .. చర్యలు తీసుకుంటామని వెల్లడి

కరోనావైరస్ కేసులలో నగరం విలవిలలాడుతున్న సమయంలో ముంబై కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన ముంబై మేయర్, అగ్నిప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారించబడలేదని , మొదటిసారి మాల్‌లో ఆస్పత్రి నిర్వహించడాన్ని చూశానని విస్మయం వ్యక్తం చేశారు. సదరు ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుండి ఇంకా అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

Posted in: Telugu News Posted by: admin On: