మరో వివాదం రేపిన రాహుల్‌-భారత్‌లో పరిణామాలపై అమెరికా మౌనంపై ప్రశ్నలు

Contacts:

National

oi-Syed Ahmed

|

Published: Saturday, April 3, 2021, 15:06 [IST]

కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో అంతర్గత విషయాలపై విదేశీ ప్రతినిధులతో మాట్లాడిన సందర్భఁగా రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో కీలకమైన అంశంపై విదేశాల ముందు భారత్‌ పరువు తీశారంటూ ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా మాజీ రాయబారి నికోలస్‌ బర్న్స్‌తో తాజాగా ఆన్‌లైన్‌లో సంభాషణ జరిపిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలను ఆయనతో పంచుకున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా మా దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు కల్గించే పరిణామాలు చోటు చేసుకుంటున్నా అమెరికా ఎందుకు మౌనంగా ఉంటోందని నికోలస్ బర్న్స్‌న్‌ రాహుల్‌ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది.

Rahul Gandhi sparks fresh row, says why is US silent on destructive happenings in India

అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యంపై జరిగిన చర్చ సందర్భంగా రాహుల్‌ భారత్‌లోనూ పరిస్దితి ఏమంత గొప్పగా లేదనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావించారు. చైనా, రష్యా వంటి నియంతృత్వ బాటలో సాగుతున్న దేశాలను గురించి భారత్‌ను ఆయన పోల్చారు. దీంతో ఈ వ్యవహారంలో రాహుల్‌ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దేశంలో అంతర్గత విషయాలపై విదేశీ మాజీ రాయబారితో రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Posted in: Telugu News Posted by: admin On: