నీలం సాహ్ని తొలి భేటీ టీడీపీతోనే -ఎస్ఈసీతో వర్ల రామయ్య -కొత్త నోటిఫికేషన్‌కు డిమాండ్ -పరిషత్ నగారా

Contacts:
 ఏకగ్రీవాల వివాదం..

ఏకగ్రీవాల వివాదం..

ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి గతేడాది మార్చి 7న నోటిఫికేషన్‌ విడుదలై, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కరోనా ముంచెత్తడంతో అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడంతో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని నిమ్మగడ్డ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదు అధారంగా కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఆరోపణలు, ఫిర్యాదులు, కోర్టు చిక్కుల దరిమిలా పరిషత్ ఎన్నికలను ఆగిన చోట నుంచే నిర్వహించలేనంటూ నిమ్మగడ్డ తెలివిగా తప్పించుకున్నారు. అయితే, ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో, పాత నోటిఫికేషన్ ఆధారంగానే కొత్త ఎస్ఈసీ సాహ్ని ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న సమాచారం మేరకు టీడీపీ నేతలు ఇవాళ ఆమెను కలిశారు.

కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి..

కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి..

ఎస్‌ఈసీగా గురువారమే బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నితో టీడీపీ నేత వర్ల రామయ్య ఈ మధ్యాహ్నం భేటీ అయ్యారు. అనంతరం వర్ల మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ తరపున ఎస్ఈసీకి ఒక విజ్ఞాపన పత్రం అందించామని తెలిపారు. గతంలో ఈ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఎలా అక్రమాలకు పాల్పడిందో వివరించామని చెప్పారు. ఎంపీటీసీల్లో గతంలో 2 శాతం ఉన్న ఏకగ్రీవలు ఇప్పుడు 24 శాతానికి చేరాయని, జెడ్పీటీసీల్లో 0.9 శాతం గతంలో ఏకగ్రీవలు ఉంటే ఇప్పుడు 19 శాతంకు చేరాయని తెలిపారు. ఏకగ్రీవలపై జోక్యం చేసుకోలేమని మాత్రమే కోర్టు చెప్పింది కాబట్టి..

నిమ్మగడ్డ ఫిర్యాదు ఆధారంగా..

నిమ్మగడ్డ ఫిర్యాదు ఆధారంగా..

ఎస్ఈసీ తన విచక్షణాధికారాలను వినియోగించుకుని పాత ఏకగ్రీవాలపై రివ్యూ చేయొచ్చని చెప్పామని వర్ల రామయ్య తెలిపారు. వివాదాలు, అనుమానాల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎసీఈసీని కోరినట్లు చెప్పారు. తాజా నోటిఫికేషన్ ఇవ్వకుండా తమరు ఎన్నికలు నిర్వహిస్తే అది మరో డ్రామాగా మారినట్టే అని అన్నారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్‌కు రాసిన లేఖలో గత ఎస్ఈసీ నిమ్మగడ్డ రాసిన లేఖ ఆధారంగా ఎస్ఈసికి ఫిర్యాదు చేశామని, పరిషత్ ఎన్నికలకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్‌ఈసీని కోరినట్లు వర్ల రామయ్య పేర్కొన్నారు.

 పరిషత్ ఎన్నికలపై సాహ్ని బిజీ..

పరిషత్ ఎన్నికలపై సాహ్ని బిజీ..

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎస్‌ఈసీగా ఇవాళ ఉదయం బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు నిర్ణయించారు. ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యదర్శి కన్నబాబుతో దీనిపై సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో ఎస్‌ఈసీ కార్యాలయంలో నీలం సాహ్ని భేటీ అయి ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా..

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇవాళ సాయంత్రం 4గంటలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎస్‌, డీజీపీ పాల్గొని ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. సమావేశం అనంతరం ఎస్‌ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ భావిస్తున్నది.

Posted in: Telugu News Posted by: admin On: