నందిగ్రామ్‌లో హైడ్రామా: పోలింగ్ బూత్ నుంచే గవర్నర్‌కు మమత ఫోన్ -కేంద్ర బలగాలపై సంచలన ఆరోపణ

Contacts:

National

oi-Madhu Kota

|

Published: Thursday, April 1, 2021, 16:00 [IST]

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం రెండో దశ పోలింగ్ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నది. బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ బరిలో ఉన్న నందిగ్రామ్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ సందర్భంగా హైడ్రామా నెలకొంది. అక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడగా, కేంద్ర బలగాలపై సీఎం మమత సంచలన ఆరోపణలు చేశారు.

మహిళా కానిస్టేబుల్‌పై 3రోజులు రేప్ -డీఐజీ, సీఐ అకృత్యం -ఎట్టకేలకు సస్పెండ్ చేసిన సీఆర్పీఎఫ్

నందిగ్రామ్ లోని ఓ పోలింగ్ బూత్‌ను పరిశీలించిన సీఎం మమత.. అక్కడి పరిస్థులు దారుణంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. పోలింగ్ బూత్ నుంచే గవర్నర్ జగ్ దీప్ ధనకర్ కు ఫోన్ చేసి, నందిగ్రామ్ సిట్యువేషన్ ను వివరించారు. భారీ ఎత్తున మోహరించిన కేంద్ర బలగాలు ఓటర్లను బూత్ లకు రానీయకుండా అడ్డుకుంటున్నాయని సీఎం ఆరోపించారు. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరారు. అంతేకాదు..

Mamata speaks to Governor from a polling booth in Nandigram, accuses forces of stopping voters

తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నికల కమిషన్.. నందిగ్రామ్ అంతటా సెక్షన్ 144 విధించింది. దీంతో కుటుంబాలు కలిసికట్టుగా ఓట్లేయడానికి రాలేని పరిస్థితి నెలకొంది. ఓటర్లను కేంద్ర బలగాలు అడ్డగిస్తున్నాయన్న మమత.. పట్టణంలో ఇంకా పెద్ద సంఖ్యలో బయటి వ్యక్తులు ఉన్నారని, బీహార్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆ ముఠాలు పోలింగ్ రోజున జైశ్రీరాం నినాదాలు, వాళ్లపై వాళ్లే రాళ్లదాడులు చేసుకుంటూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని విమర్శించారు.

నీలం సాహ్ని తొలి భేటీ టీడీపీతోనే -ఎస్ఈసీతో వర్ల రామయ్య -కొత్త నోటిఫికేషన్‌కు డిమాండ్ -పరిషత్ నగారా

మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి రెండో దశ ఎన్నికల్లో భాంగా గురువారం 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం మధ్యాహ్నం సమయానిని 58శాతం ఓటింగ్ నమోదైంది. అటు అస్సాంలోనై రెండో దశ పోలింగ్ జరుగుతోన్న 39 అసెంబ్లీ స్థానాల్లో కలిపి 48శాతం పోలింగ్ నమోదైంది.

Posted in: Telugu News Posted by: admin On: