కొన్నిగంటల్లో కేరళ పోల్.. బరిలో 957 మంది, వయోజనలు 2.74 కోట్లు

Contacts:

National

oi-Shashidhar S

|

Published: Monday, April 5, 2021, 22:30 [IST]

మరికొన్ని గంటల్లో కేరళ అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గతంలో లేనివిధంగా కేరళలో ఎన్నికల జరగబోతున్నాయి. అధికార పార్టీ తిరిగి విజయం సాధిస్తోందని ఓపినీయన్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో 2.74 కోట్ల మంది వయోజనులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 957 మంది భవితవ్యం మరికొద్దీ రోజుల్లో తేలనుంది.

కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. 2.74 కోట్ల మంది ఓటర్లలో కోటి 32 లక్షల 83 వేల 724 మంది పురుషులు ఉండగా.. కోటి 41 లక్షల 62 వేల 25 మంది స్త్రీలు ఉన్నారు. 290 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేశారు.

2.74 crore voters in Kerala to decide fate of 957 candidates

బరిలో సీఎం పినరయి విజయన్, వైద్యారోగ్యశాఖ మంత్రి కేకే శైలజ, కడకంపల్లి సురేంద్రన్, విద్యుత్ శాఖ మంత్రి ఎంఎం మని, విద్యాశాఖ మంత్రి కేకే జలీల్ అధికార పార్టీ నుంచి ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి రమేశ్ చెన్నితలా, మాజీ సీఎం ఉమెన్ చాందీ, సీనియర్ నేత మురళిధరన్, పీటీ థామస్, తిరువాచూర్ రాధాకృష్ణన్ ఉన్నారు.

యూడీఎఫ్ కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఆయన పదుల సంఖ్యలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఎన్నికలను బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మాజీ మిజోరం గవర్నర్ కుమ్మమ్ రాజశేఖరన్, మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్, సీనియర్ నేత శోభ సురేంద్రన్, రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపి, కేజే అల్పోన్స్ బరిలో ఉన్నారు.

Posted in: Telugu News Posted by: admin On: