కరోనా మహమ్మారి ఉగ్రరూపం .. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్ , 81,466 కొత్త కేసులు , 469 మరణాలు

Contacts:
ఈ రాష్ట్రాలలోనే కేసులు అధికం.. 84.61 శాతం ఈ రాష్ట్రాలలోనే

ఈ రాష్ట్రాలలోనే కేసులు అధికం.. 84.61 శాతం ఈ రాష్ట్రాలలోనే

మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ , కర్ణాటక, పంజాబ్, కేరళ, తమిళనాడు, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రోజువారీ కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి . 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసులలో ఈ రాష్ట్రాలలోనే 84.61 శాతం ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా వైరస్ కేసులలో దాదాపు ఆరు నెలల్లో ఇంత భారీగా ఈరోజు కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా అర్థమవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసులలో మూడో స్థానంలో భారత్

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసులలో మూడో స్థానంలో భారత్

మహమ్మారి సెకండ్ వేవ్ నేపథ్యంలో విపరీతంగా 81,466 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి . ఇవి దేశం యొక్క మొత్తం కాసేలోడ్‌ను 12.3 మిలియన్లకు పెంచాయి . ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులలో మూడవ స్థానంలో ఉంది. కరోనా కేసులలో యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్ తరువాత మూడవ స్థానంలో భారతదేశం ఉంది.

గత 24 గంటల్లో 30,641 క్రియాశీల కేసులు నమోదు కాగా, క్రియాశీల కేసుల సంఖ్య 614,696 కు పెరిగింది.

తగ్గుతున్న రికవరీ రేటు .. దేశంలో ఆందోళన

తగ్గుతున్న రికవరీ రేటు .. దేశంలో ఆందోళన

కరోనావైరస్ తో 50,401 మంది రికవర్ అయ్యారు,. దీంతో దేశవ్యాప్తంగా 1,15,25,039 మంది రోగులు కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు ఇప్పుడు 93.67 శాతంగా ఉంది.

తగ్గుతున్న రికవరీ రేటు ఇప్పుడు దేశంలో ఆందోళనకు కారణంగా మారింది . పెరుగుతున్న కేసుల కంటే చాలా తక్కువగా రికవరీలు నమోదు కావటంతో కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగిస్తున్నాయి .

కరోనా కంట్రోల్ కి ప్రయత్నాలు .. వ్యాక్సినేషన్ సైతం వేగవంతం

కరోనా కంట్రోల్ కి ప్రయత్నాలు .. వ్యాక్సినేషన్ సైతం వేగవంతం

కోవిడ్ -19 కోసం ఏప్రిల్ 1 వరకు 24,59,12,587 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. వీటిలో 11,13,966 నమూనాలను గురువారం పరీక్షించారు.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నేపథ్యంలో భారతదేశం తన టీకా డ్రైవ్‌ను మరింత వేగవంతం చేసింది. కరోనా నియంత్రణకు చర్యలు చేపడుతూనే, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

తీవ్ర ప్రభావం ఉన్న రాష్ట్రాలు , వివిధ ప్రాంతాలలో నైట్ కర్ఫ్యూ , లాక్ డౌన్ వంటి చర్యలను తీసుకుంటున్నారు.

Posted in: Telugu News Posted by: admin On: