ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు .. తాజాగా 997 కొత్త కేసులు

Contacts:
 గత 24 గంటల వ్యవధిలో 31,324 నమూనాలను పరీక్షించగా 997 కొత్త కేసులు

గత 24 గంటల వ్యవధిలో 31,324 నమూనాలను పరీక్షించగా 997 కొత్త కేసులు

గత 24 గంటల వ్యవధిలో 31,324 నమూనాలను పరీక్షించగా 997 కొత్త కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8 ,99,812 కు చేరుకుంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు వివరాలు చూస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక విజయనగరం జిల్లాలో అత్యల్పంగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఏపీలో కేసుల పెరుగుదల ఏపీ వాసులకు ఆందోళన కలిగిస్తుంది .

జిల్లాల వారీగా కేసుల వివరాలివే

జిల్లాల వారీగా కేసుల వివరాలివే

గుంటూరు జిల్లాలో 151 కేసులు, కృష్ణాజిల్లాలో 110 కేసులు, అనంతపురం జిల్లాలో 57 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 45 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 28 కేసులు, కర్నూలులో 82 ,నెల్లూరులో 84, ప్రకాశంలో 41 కేసులు , శ్రీకాకుళం జిల్లాలో 61, విశాఖపట్నంలో 139 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 997 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 6,104 కేసులు ఉండగా, కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,86,498 గా ఉంది.

గత 24 గంటల్లో ఐదుగురు మృతి , మొత్తం మృతుల సంఖ్య 7,210

గత 24 గంటల్లో ఐదుగురు మృతి , మొత్తం మృతుల సంఖ్య 7,210

ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7,210కి చేరుకుంది . ఇక కరోనా నుండి గత 24 గంటల్లో 282 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాలలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని, మాస్కులు ధరించకుండా ఎవరు బయటకు రావద్దని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ప్రభుత్వం కోరుతోంది.

Posted in: Telugu News Posted by: admin On: